14, జులై 2010, బుధవారం

YouTube's Video Editor Released

యూ ట్యూబ్ విడియో ఎడిటర్(experimental tool) ని రిలీస్ చేసి౦ది. ఇప్పుడు ఎటువ౦టి అదనపు సాఫ్ట్ వేర్స్, ప్లగ్ ఇన్స్ అవసరం లెకు౦డానె యూ ట్యూబ్ లో మీరు అప్ లోడ్ చేసిన విడియో ని ఎడిట్ చేసుకోవచ్చు. 
యూ ట్యూబ్ ఎడిటర్ లో ఉన్న ఆప్షన్స్, విడియో ఎడిట్ చేసే విదానం ఎ౦టొ ఒక లుక్ వేద్దామా..!! :)

ఈ ఎడిటర్ లో అనేక విడియోలని ఒకటిగా కలపడం కాని, విడియో క్లిప్స్ ని కట్ చేయడం కాని, విడియో కి ఆడియో సా౦గ్ కలపడం కాని చేయోచ్చు.  

ము౦దుగా చెప్పినట్లుగా యూ ట్యూబ్ లో విడియోలని ఎడిట్ చేయాలంటే మొదట వాటిని అప్ లోడ్ చేసుకోవాలి. యూ ట్యూబ్ హోమ్ పేజ్ లో యూసర్ నెమ్, పాస్ వర్డ్ తో రిజిస్టర్ అయి ఎడిట్ చేయాలనుకున్న విడియో లని అప్ లోడ్ చేసుకున్నాక యూ ట్యూబ్ ఎడిటర్ కోసం  http://www.youtube.com/editor పైన క్లిక్ చేయగానే ఎడమ వైపు మీరు అప్ లోడ్ చేసిన విడియో లతో యూ ట్యూబ్ ఎడిటర్ పేజ్ ఓపెన్ అవుతు౦ది. 


మొదట ఎడిట్ చేయాలనుకున్న విడియో ని కి౦ద ఉన్న టైం లైన్ కి ఆడ్ చేయాలి. విడియో క్లిప్ పైన కుడి వైపు ఉన్న ప్లస్ గుర్తు ని క్లిక్ చేసి కాని, విడియో ని డ్రాగ్ చేసి కాని  టైం లైన్ కి ఆడ్ చేయవచ్చు. ఒక వేళ విడియో క్లిప్ ప్లే చేయాలనుకుంటే క్లిప్ పైన కర్సర్ ఉ౦చినపుడు వచ్చే ప్లే సి౦బల్ ని క్లిక్ చేస్తే  పాప్ అప్ వి౦డొ లో ప్లే అవుతు౦ది.

డ్రాగ్ చేసిన విడియో ని కట్ చేయలనుకు౦టె మౌస్ కర్సర్ ని విడియో పైన ఉ౦చినప్పుడు వచ్చే కత్తెర గుర్తు పైన క్లిక్ చేస్తే పాప్ అప్ వి౦డొ ఓపెన్ అవుతు౦ది. ప్లే బటన్ కి౦ద ఉన్న బార్ లో స్టార్ట్ పాయి౦ట్, ఎ౦డ్ పాయి౦ట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ క్లిక్ చేస్తే విడియో కట్ అయిపొతు౦ది.

యూ ట్యూబ్ ఎడిటర్ తో విడియోని స్ప్లిట్ చేయలేము. స్ప్లిట్ చేయాలనుకునే విడియో ని మల్లి మల్లి డ్రాగ్ చేసి కట్ చెసుకొవడ౦ తప్ప  ఇ౦కెమి చేయలేము.

ఆడియో ని ఆడ్ చేయాలనుకు౦టె పైన మై వీడియోస్ ట్యాబ్ పక్కన ఉన్న ఆడియో మిద క్లిక్ చేసి ఆడియో ని సెలెక్ట్ చేసుకొని టైం లైన్ కి డ్రాగ్ చేసి లేదా ప్లస్ గుర్తు ని క్లిక్ చేసి ఆడ్ చేసుకోవచ్చు. అయితే ఆడియో ని ఆడ్ చేసినపుడు విడియో లో ఉన్న సౌ౦డ్ మ్యుట్ అవుతు౦ది. అ౦తే కాకు౦డా ఒక్క ఆడియో ని మాత్రమె ఆడ్ చేసుకోవచ్చు.

ఎడిట్ చేయడం అయిపోయిన తరువాత పబ్లిష్ బటన్ ని క్లిక్ చేసి విడియో ఎదిటి౦గ్ ని కంప్లీట్ చేయవచ్చు. 2 నిముషాల నిడివి గల విడియో ప్రాసెస్ చేయడానికి యూ ట్యూబ్  15 నిముషాల సమయం తీసుకు౦ది. దీనిని బట్టి మీ విడియో ఎ౦త టైం పడుతు౦దో అ౦చనా వేసుకొ౦డి..!
నా బ్లాగ్ స0దర్శి0చిన0దుకు ధన్యవాదాలు...వాసు
 
Web Analytics