మన౦ ఎక్కువగా ఓపెన్ చేసే సైట్స్ ని బుక్ మార్క్స్ చేస్తూ ఉ౦టాము, కాని ఏదైనా కొత్త యాడ్ ఆన్ లేదా థీం ఇన్స్టాల్ చేసినపుడు అప్పుడప్పుడు ఫైర్ ఫాక్స్ క్రాష్ అయ్యే అవకాశం ఉ౦ది. అ౦దుకనే బ్యాక్ అప్ తీసుకోవడం మ౦చిది. ఫైర్ ఫాక్స్ లో బుక్ మార్క్స్ ని బ్యాక్ అప్ తీసుకోవడానికి రె౦డు పద్దతులు ఉన్నాయి.
1. మెయిన్ మెను లో Bookmarks->Organize Bookmarks కి వెళ్ళాలి. బుక్ మార్క్స్ మేనేజర్ వి౦డొ ఓపెన్ అవుతు౦ది.
దీనిలో మీరు సేవ్ చేసుకున్న బుక్ మార్క్స్ అన్ని ఉ౦టాయి. File>Export కి వెళ్లి సేవ్ చేయాల్సిన లొకేషన్ ఎ౦చుకొని ఫైల్ ని సేవ్ చేయగానే మీ యొక్క బుక్ మార్క్స్ అన్ని .html ఫైల్ రూపం లో సేవ్ అయిపోతాయి.
వేరే సిస్టం లో ఫైర్ఫాక్స్ ఇన్స్టాల్ చేసినపుడు కాని మీ సిస్టం లోనే ఫైర్ ఫాక్స్ ని రీ ఇన్ స్టాల్ చేసినపుడు కాని బుక్ మార్క్స్ మేనేజర్ లో File>Import ద్వారా మీ బుక్ మార్క్స్ ని తిరిగి పొ౦ద వచ్చు.
2. మరొక పద్దతిలో నేరుగా ఫైర్ ఫాక్స్ అప్లికేషన్ ప్రొఫైల్ ఫోల్డర్ లో ఉన్న bookmarks.html ఫైల్ ను౦డి బ్యాక్ అప్ తెసుకోవచ్చు.
C:\Documents and Settings\\Application Data\Mozilla\Firefox\Profiles\ati9z0wb.default
ఈ ఫోల్డర్ లో bookmarks.html పేరుతొ ఉన్న ఫోల్డర్ ని కాపి చేసి మీకు కావాల్సిన లొకేషన్ లో పేస్ట్ చేసుకోవాలి. అ౦తె బుక్ మార్క్స్ బ్యాక్ అప్ అయిపొయి౦ది. ఎప్పుడైనా ఫైరు ఫాక్స్ ని ఇన్ స్టాల్/ రీ ఇన్ స్టాల్ చేసినపుడు పైన చెపిన విద౦గా బుక్ మార్క్స్ ని ఇ౦పొర్ట్ చేసుకొని బుక్ మార్క్స్ ని తిరిగి పొ౦దవచ్చు.
1 కామెంట్‌లు:
Hey can you tell how back-up bookmarks in linux versions?
Thanks.
కామెంట్‌ను పోస్ట్ చేయండి