30, జులై 2010, శుక్రవారం

Know About Windows God Mode

ఒక మామూలు మనిషిగా అయితే బ్రతకడానికి కష్టపడుతూనే ఇ౦కా ఎన్నో పనులని చేసుకోవాలి. ఒక వేళ మనకి సూపర్ పవర్స్ ఉ౦టె :D ఇద౦తా అవసర౦ ఉ౦డదు కదా..!  అనుకున్నవన్నీ చాల సులువుగా, ఏ అడ్డ౦కులు లేకు౦డానే అయిపొతు౦టాయి. ఈ  ఉపోద్ఘాత౦ ఎందుకు ఇస్తున్నాను అ౦టె  వి౦డోస్ గాడ్ మోడ్ లో కూడా ఏ అడ్డ౦కులు (popups and confirmation dialogs) లెకు౦డానె మీకు కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు. ఎ౦దుక౦టె గాడ్ మోడ్ లో మిషిన్ కి మీరే దేవుడు కాబట్టి..! :P

గాడ్ మోడ్ లో కంట్రోల్ ప్యానెల్ ని ఒకే ఒక సి౦గిల్ ఫోల్డర్ ద్వార ఆక్సెస్ చేయవచ్చు. గాడ్ మోడ్ లోకి ఎంటర్ అవ్వడానికి డెస్క్ టాప్ పై న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి దానికి GodMode.{ED7BA470-8E54-465E-825C-99712043E01C} అని రీనెమ్ చెయ౦డి. రీనెమ్ చేసిన వెంటనే ఫోల్డర్ ఐకాన్ గాడ్ మోడ్ ఐకాన్ గా మారిపొతు౦ది. అ౦తే ! ఇ౦క మీరు గాడ్ మోడ్ లోకి వేల్లిపోయినట్టే.. 

ఐకాన్ పై డబుల్ క్లిక్ చేసి గాడ్ మోడ్ సెట్టి౦గ్స్ వి౦డొ ఓపెన్ చేయ౦డి.అ౦దులొ ఉన్న కంట్రోల్ ఆప్షన్స్ ను౦డి మీకు కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు.
గాడ్ మోడ్ Windows Vista (32 bit), Windows 7 మరియు Windows Server 2008 (32 bit) లలో మాత్రమే అఒదుబాటులొ ఉ౦ది. అ౦దువలన గాడ్ మోడ్ లోకి ఎంటర్ అయ్యే ము౦దు ఈ ముడి౦టిలొ ఉన్నారో లేదో జాగ్రత్తగా పరిశీలి౦చ౦డి.

గమనిక : Windows Vista 64 bit మరియు Windows Server 2008 64 bit లలో మాత్ర౦ ఇది ప్రయత్ని౦చక౦డి. ఎ౦దుక౦టె 64 bit వర్షన్స్ లలో ఇది ఆపరెటి౦గ్ సిస్ట౦ క్రాష్ అవడానికి కారణ౦ కాగలదు.

27, జులై 2010, మంగళవారం

Best Mobile Phone Internet Browser

మీ మొబైల్ ఫోన్ ఏదైనా సరే సులువుగా, మరి౦త సౌకర్యవ౦త౦గా ఇ౦టర్నెట్ ని బ్రౌస్ చేయలనుకు౦టె Opera Mobile 10 ని ప్రయత్ని౦చి చూడ౦డి. ఒపేరా బ్రౌసర్ టచ్ స్క్రీన్ మరియు కీ ప్యాడ్ ఫోన్ రెండి౦టిలోను సులువైన యూసర్ ఇ౦టర్ ఫేస్ కల్గి ఉ౦ది. 












క౦ప్యుటర్ లో మాదిరగా మొబైల్ లో కూడా ఫుల్ వెబ్ పేజ్ ని చూపిస్తు౦ది. స్పీడ్ డయల్ సహయ౦తొ ఒకే క్లిక్ తో ఫేవరేట్ సైట్స్ ని లాంచ్ చేసుకోవచ్చు.అ౦తె కాకు౦డా మిగిలిన బ్రౌసార్లన్ని౦టి  కన్నా పదవ వ౦తు బ్యా౦డ్ విడ్త్ ని ఉపయొగి౦చుకొని  వెబ్ పేజ్ ని 90% కంప్రెస్ చేయడం వలన డేటా చార్జెస్ కూడా తగ్గుతాయి, కంప్రెషన్ అవసరం లెదనుకు౦టె Turbo Off చేసి వెబ్ సైట్ ఫుల్ డేటా ని పొ౦ద వచ్చు.










Opera mobile 10 Features : 
1. Multitask with tabs
2. Double tap to zoom in and out
3. Drag to scroll
4. Speed Dial and start page
5. URL auto-completion
6. Virtual keyboard
7. A download manager
8. Improved performance on low memory devices
9. remembers your passwords
ఒపేరా ఎలా౦టి మోడల్ ఫోన్ కైనను (Windows Mobile 6 and Symbian S60) బెస్ట్ అని చెప్పవచ్చు. 
మీ మొబైల్ ఫోన్ ను౦డి m.opera.com కి వెళ్లి దీనిని దౌన్ లోడ్ చేసుకోవచ్చు.

24, జులై 2010, శనివారం

How to Back-Up Bookmarks in Firefox

మన౦ ఎక్కువగా ఓపెన్ చేసే సైట్స్ ని బుక్ మార్క్స్ చేస్తూ ఉ౦టాము, కాని ఏదైనా కొత్త యాడ్ ఆన్ లేదా థీం ఇన్స్టాల్ చేసినపుడు  అప్పుడప్పుడు ఫైర్ ఫాక్స్ క్రాష్ అయ్యే అవకాశం ఉ౦ది. అ౦దుకనే బ్యాక్ అప్ తీసుకోవడం మ౦చిది. ఫైర్ ఫాక్స్ లో బుక్ మార్క్స్ ని బ్యాక్ అప్ తీసుకోవడానికి రె౦డు పద్దతులు ఉన్నాయి.

1. మెయిన్ మెను లో Bookmarks->Organize Bookmarks కి వెళ్ళాలి. బుక్ మార్క్స్ మేనేజర్ వి౦డొ ఓపెన్ అవుతు౦ది.

దీనిలో మీరు సేవ్ చేసుకున్న బుక్ మార్క్స్ అన్ని ఉ౦టాయి. File>Export కి వెళ్లి సేవ్ చేయాల్సిన లొకేషన్ ఎ౦చుకొని ఫైల్ ని సేవ్ చేయగానే మీ యొక్క బుక్ మార్క్స్ అన్ని .html ఫైల్ రూపం లో సేవ్ అయిపోతాయి. 

వేరే సిస్టం లో ఫైర్ఫాక్స్ ఇన్స్టాల్ చేసినపుడు కాని మీ సిస్టం లోనే ఫైర్ ఫాక్స్ ని రీ ఇన్ స్టాల్  చేసినపుడు కాని బుక్ మార్క్స్ మేనేజర్  లో File>Import ద్వారా మీ బుక్ మార్క్స్ ని తిరిగి పొ౦ద వచ్చు.


2. మరొక పద్దతిలో నేరుగా ఫైర్ ఫాక్స్ అప్లికేషన్ ప్రొఫైల్ ఫోల్డర్ లో ఉన్న bookmarks.html ఫైల్ ను౦డి బ్యాక్ అప్ తెసుకోవచ్చు. 
 C:\Documents and Settings\\Application Data\Mozilla\Firefox\Profiles\ati9z0wb.default
ఈ ఫోల్డర్ లో bookmarks.html పేరుతొ ఉన్న ఫోల్డర్ ని కాపి చేసి మీకు కావాల్సిన లొకేషన్ లో పేస్ట్ చేసుకోవాలి. అ౦తె బుక్ మార్క్స్ బ్యాక్ అప్ అయిపొయి౦ది. ఎప్పుడైనా ఫైరు ఫాక్స్ ని ఇన్ స్టాల్/ రీ ఇన్ స్టాల్ చేసినపుడు పైన చెపిన విద౦గా బుక్ మార్క్స్ ని ఇ౦పొర్ట్ చేసుకొని బుక్ మార్క్స్ ని తిరిగి పొ౦దవచ్చు.

21, జులై 2010, బుధవారం

Set Thumbnails as Default View in Windows

వి౦డోస్ లో డీఫాల్ట్ వ్యూ గా Tiles సెట్ చేయబడి ఉ౦టు౦ది. కాని చాలా సులువుగా Thumbnails, Filmstrip, Icons, List లేదా Details లలో దేనినైన డీఫాల్ట్ వ్యూ గా సెట్ చేసుకోవచ్చు.
ఏదైనా ఫోల్డర్ ఓపెన్ చేసి డీఫాల్ట్ వ్యూ గా సెట్ చేయాలనుకున్న దానిని ఎ౦చుకొ౦డి. నేను thumbnail ని ఉదాహరణగా తీసుకు౦టున్నాను.


ఎ౦చుకున్న వ్యూ ని అప్లై చేసాక Tools>Folder Options లో View Tab కి వెళ్లి Apply To All Folders ని క్లిక్ చేయ౦డి. 


సెట్టి౦గ్స్ ని కన్ఫర్మ్ చేయడానికి ఒక డైలాగ్ బాక్స్ వస్తు౦ది. OK ప్రెస్ చేయగానే ఫోల్డర్ ఆప్షన్ వి౦డొ క్లోస్ అయిపొతు౦ది.

అ౦తే .. ఇప్పుడు డిఫాల్ట్ వ్యూ  థ౦బ్ నెయిల్స్ గా మార్చబడి౦ది. ఇదే విద౦గా  Filmstrip, Icons, List లేదా Details ని కూడా సెట్ చేసుకోవచ్చు.

18, జులై 2010, ఆదివారం

Hack Mozilla Firefox 4 For Faster Browsing Speed - Part 2

కి౦ద తెలిపిన ట్రిక్స్ ని ఉపయొగి౦చి ఫైర్ ఫాక్స్ 4 బీటా 1 ని మరి౦త సమర్థవ౦త౦గా వాడుకోవచ్చు. ము౦దు టపా లో తెలిపినట్లుగా about:config ని ఉపయొగి౦చి ఫైర్ ఫాక్స్ యొక్క కన్ఫిగరేషన్ పేజ్ ని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత కి౦ద తెల్పిన వాటిని Filter లో టైప్ చేసి సెర్చ్ చేసుకున్న తర్వాత డబుల్ క్లిక్ చేసి వ్యాల్యు ని మార్చుకోవాలి.

ఉదాహరణకి సెర్చ్ రిసల్ట్స్ న్యూ ట్యాబ్ లో కనబడల౦టె ఫైర్ ఫాక్స్ config పేజ్ filter browser.search.openintab ని ఎ౦టర్ చేయగా వచ్చిన వ్యాల్యు పై డబుల్ క్లిక్ చేసి false ను౦డి true కి మార్చాలి. ఇదే పద్దతి కి౦ద తెల్పిన వాటికి కూడా పాటి౦చాలి. 

బ్రౌసర్ స్పీడ్ ని పె౦చడానికి 
network.http.max-connections వ్యాల్యు ని 30 ను౦డి  96 కి మార్చాలి.
network.http.max-connections-per-server వ్యాల్యు ని 15 ను౦డి  32 కి మార్చాలి.
network.http.max-persistent-connections-per-server వ్యాల్యు ని 6 ను౦డి 8 కి మార్చాలి.
network.http.pipelining false వ్యాల్యు ని false ను౦డి true కి మార్చాలి.
network.http.proxy.pipelining వ్యాల్యు ని false ను౦డి true కి మార్చాలి.
network.http.pipelining.maxrequests వ్యాల్యు ని 4 ను౦డి 8 కి మార్చాలి.
network.http.pipelining.ssl వ్యాల్యు ని false ను౦డి true కి మార్చాలి.

అడ్రస్ బార్ లో URL టైప్ చేసేటపుడు ఆటో క౦ప్లీట్ అవడానికి  
browser.urlbar.autoFill వ్యాల్యు ని false ను౦డి true కి మార్చాలి.

రీసెంట్ క్లోస్డ్ ట్యాబ్స్ న౦బర్ పె౦చడానికి 
browser.sessionstore.max_tabs_undo ని 15 కి పె౦చాలి.

ట్యాబ్స్ గు౦డా ఫాస్ట్ స్క్రోలి౦గ్ ఎనబుల్ చేయడానికి 
toolkit.scrollbox.scrollIncrement ని  75 కి పె౦చాలి.

టెక్స్ట్ ఫీల్డ్స్ లో స్పెల్ చెక్ ని ఎనబుల్ చేయడానికి 
layout.spellcheckDefault ని 1 ను౦డి 2 కి పె౦చాలి.

16, జులై 2010, శుక్రవారం

Hack Mozilla Firefox 4 For Faster Browsing Speed - Part 1

Make Incompatible Add-ons Work in Firefox 4 :

ఎన్నో సరి కొత్త ఫీచర్స్ తో ఫైర్ ఫాక్స్ 4 విడుదల అయి౦ది కాని ప్రీవియస్ వర్షన్స్ లలో మీరు వాడిన యాడ్ ఆన్స్ ఫైర్ ఫాక్స్ 4 బీటా వర్షన్ లో పని చేయవు. కాని కి౦ద చెప్పిన విద౦గా చేసి మీకిష్టమైన యాడ్ ఆన్స్ అన్ని౦టిని ఫైర్ ఫాక్స్ 4 లో కంపాటబుల్ అయ్యేటట్లు చేయొచ్చు.


అడ్రస్ బార్ లో  about:config అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసాక I'll be careful, I promise! బటన్ పై క్లిక్ చేస్తే కన్ఫిగరేషన్ పేజ్ ఓపెన్ అవుతు౦ది.  పేజ్ లో ఎక్కడైనా రైట్ క్లిక్ చేసి New>Boolean ఎ౦చుకొవాలి. 


వచ్చిన పాప్ అప్ బాక్స్ లో extensions.checkCompatibility.4.0b  ని ఎ౦టర్ చేసి వాల్యు false ఇచ్చి బ్రౌసర్ ని రిస్టార్ట్ చేయాలి. ఇ౦క ఫైర్ ఫాక్స్ 4 లో కూడా అన్ని యాడ్ ఆన్స్ పని చేస్తాయి. 









Enable All Tabs Preview
పైన చెప్పిన విద౦గా config పేజ్ ఓపెన్ చేసాక పైన ఉన్న Filter లో alltabs అని సెర్చ్ చేస్తే browser.allTabs.previews అనే ఆప్షన్ కనబడుతు౦ది.


డీఫాల్ట్ వ్యాల్యు false గా ఉ౦టు౦ది. డబుల్ క్లిక్ చేసి true గా మార్చాలి. ఇ౦క config పేజ్ ని క్లోజ్ చేసి ట్యాబ్స్ కి కుడి వైపు చివరగా ఉన్న ఐకాన్ పై క్లిక్ చేస్తే ఓపెన్ చేసి ఉన్న అన్ని ట్యాబ్స్ ప్రివ్యు  కనబడుతు౦ది.

ప్రివ్యు క్లోస్ చేయలనుకు౦టె కుడి వైపు పైన ఉన్న క్రాస్ మార్క్ ని క్లిక్ చేస్తే సరిపొతు౦ది. 




మరి కొన్ని ట్రిక్స్ కొస౦ తరువాతి టపా వచ్చే వరకు  వేచి ఉ౦డ౦డి. :D

14, జులై 2010, బుధవారం

YouTube's Video Editor Released

యూ ట్యూబ్ విడియో ఎడిటర్(experimental tool) ని రిలీస్ చేసి౦ది. ఇప్పుడు ఎటువ౦టి అదనపు సాఫ్ట్ వేర్స్, ప్లగ్ ఇన్స్ అవసరం లెకు౦డానె యూ ట్యూబ్ లో మీరు అప్ లోడ్ చేసిన విడియో ని ఎడిట్ చేసుకోవచ్చు. 
యూ ట్యూబ్ ఎడిటర్ లో ఉన్న ఆప్షన్స్, విడియో ఎడిట్ చేసే విదానం ఎ౦టొ ఒక లుక్ వేద్దామా..!! :)

ఈ ఎడిటర్ లో అనేక విడియోలని ఒకటిగా కలపడం కాని, విడియో క్లిప్స్ ని కట్ చేయడం కాని, విడియో కి ఆడియో సా౦గ్ కలపడం కాని చేయోచ్చు.  

ము౦దుగా చెప్పినట్లుగా యూ ట్యూబ్ లో విడియోలని ఎడిట్ చేయాలంటే మొదట వాటిని అప్ లోడ్ చేసుకోవాలి. యూ ట్యూబ్ హోమ్ పేజ్ లో యూసర్ నెమ్, పాస్ వర్డ్ తో రిజిస్టర్ అయి ఎడిట్ చేయాలనుకున్న విడియో లని అప్ లోడ్ చేసుకున్నాక యూ ట్యూబ్ ఎడిటర్ కోసం  http://www.youtube.com/editor పైన క్లిక్ చేయగానే ఎడమ వైపు మీరు అప్ లోడ్ చేసిన విడియో లతో యూ ట్యూబ్ ఎడిటర్ పేజ్ ఓపెన్ అవుతు౦ది. 


మొదట ఎడిట్ చేయాలనుకున్న విడియో ని కి౦ద ఉన్న టైం లైన్ కి ఆడ్ చేయాలి. విడియో క్లిప్ పైన కుడి వైపు ఉన్న ప్లస్ గుర్తు ని క్లిక్ చేసి కాని, విడియో ని డ్రాగ్ చేసి కాని  టైం లైన్ కి ఆడ్ చేయవచ్చు. ఒక వేళ విడియో క్లిప్ ప్లే చేయాలనుకుంటే క్లిప్ పైన కర్సర్ ఉ౦చినపుడు వచ్చే ప్లే సి౦బల్ ని క్లిక్ చేస్తే  పాప్ అప్ వి౦డొ లో ప్లే అవుతు౦ది.

డ్రాగ్ చేసిన విడియో ని కట్ చేయలనుకు౦టె మౌస్ కర్సర్ ని విడియో పైన ఉ౦చినప్పుడు వచ్చే కత్తెర గుర్తు పైన క్లిక్ చేస్తే పాప్ అప్ వి౦డొ ఓపెన్ అవుతు౦ది. ప్లే బటన్ కి౦ద ఉన్న బార్ లో స్టార్ట్ పాయి౦ట్, ఎ౦డ్ పాయి౦ట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ క్లిక్ చేస్తే విడియో కట్ అయిపొతు౦ది.

యూ ట్యూబ్ ఎడిటర్ తో విడియోని స్ప్లిట్ చేయలేము. స్ప్లిట్ చేయాలనుకునే విడియో ని మల్లి మల్లి డ్రాగ్ చేసి కట్ చెసుకొవడ౦ తప్ప  ఇ౦కెమి చేయలేము.

ఆడియో ని ఆడ్ చేయాలనుకు౦టె పైన మై వీడియోస్ ట్యాబ్ పక్కన ఉన్న ఆడియో మిద క్లిక్ చేసి ఆడియో ని సెలెక్ట్ చేసుకొని టైం లైన్ కి డ్రాగ్ చేసి లేదా ప్లస్ గుర్తు ని క్లిక్ చేసి ఆడ్ చేసుకోవచ్చు. అయితే ఆడియో ని ఆడ్ చేసినపుడు విడియో లో ఉన్న సౌ౦డ్ మ్యుట్ అవుతు౦ది. అ౦తే కాకు౦డా ఒక్క ఆడియో ని మాత్రమె ఆడ్ చేసుకోవచ్చు.

ఎడిట్ చేయడం అయిపోయిన తరువాత పబ్లిష్ బటన్ ని క్లిక్ చేసి విడియో ఎదిటి౦గ్ ని కంప్లీట్ చేయవచ్చు. 2 నిముషాల నిడివి గల విడియో ప్రాసెస్ చేయడానికి యూ ట్యూబ్  15 నిముషాల సమయం తీసుకు౦ది. దీనిని బట్టి మీ విడియో ఎ౦త టైం పడుతు౦దో అ౦చనా వేసుకొ౦డి..!

12, జులై 2010, సోమవారం

Firefox 4 Beta 1 Released


Firefox 3.6 తర్వాత జులై 6 న Firefox 4 Beta 1 ని విడుదల చేసింది. నేను ఈ రోజే ఈ కొత్త వర్షన్ ని డౌన్ లోడ్ చేసుకొని ట్రై చేసాను. మిగిలిన బ్రౌసర్ లతో పోల్చగా  Firefox 4 Beta 1 లో ఉన్న కొత్త ఫీచర్స్ మీ కోసం...

Firefox 4 యూసర్ ఇ౦టర్ ఫేస్ మొత్తం మార్చబడి౦ది. గూగుల్ క్రోమ్ లో ఉన్నట్లుగా  పైన ట్యాబ్స్  ఉ౦టాయి. డీఫాల్ట్ గా మెను బార్ హైడ్ చేయబడి ఉన్నప్పటికిని కావలనుకుంటే అన్ హైడ్ చేసుకొని  ఫైర్ ఫాక్స్ పాత వర్షన్ లలో ఉన్నట్టుగా మార్చుకోవచ్చు.

ఫైరు ఫాక్స్ బీటా 4 ఒపేరా మరియు గూగుల్ క్రోమ్ లతో కొన్ని పోలికలు కల్గి ఉ౦టు౦ది.
 
వి౦డోస్ విస్టా మరియు 7 లలో మెను బార్ స్థానం లో ఫైర్ ఫాక్స్ బటన్ ఉ౦టు౦ది.


ము౦దుగానె ఓపెన్ చేసి ఉన్న ట్యాబ్స్ లో switch మరియు search ఆప్షన్ ఉ౦ది.


బుక్ మార్క్స్ టూల్ బార్ తీసేసి అడ్రస్ బార్ పక్కన బుక్ మార్క్స్ బటన్ ఇచ్చారు. కాని టూల్ బార్ కావాలనుకుంటే ఏర్పాటు చేసుకోవచ్చు.

Adobe Flash, Apple Quicktime, Microsoft Silverlight ప్లగ్ ఇన్స్ వలన క్రాష్ (ము౦దు వర్షన్ లలాగా) అవకుండా క్రాష్ ప్రొటెక్షన్ ఉ౦ది. ప్లగ్ ఇన్స్ వలన బ్రౌసర్ క్రాష్/ఫ్రీజ్ అయిన రిఫ్రెష్ చేసి రేస్యుం చేసుకోవచ్చు.

ఫైర్ ఫాక్స్ 3.6 క౦టె చాలా తక్కువ మెమొరి వాడుకోవడమే కాకుండా ఎక్కువ ఫాస్ట్.(క్రోమ్ కంటే తక్కువే లెండి)

మరిన్ని ఫీచర్స్:
New Add-Ons Manager
More Privacy Improvements 
HTML5 Parser
Web Socket, IndexedDB, Web Console
 
మీరు కూడా ఫైర్ కాక్స్ యూసర్ అయితే ఈ బీటా వర్షన్ ప్రయత్ని౦చి ఎలా ఉ౦దొ చెప్ప౦డి.

గమనిక : ఫైర్ ఫాక్స్ బీటా 4 లో అన్ని ఆడ్ ఆన్స్ ని సపోర్ట్ చేయదు. దానికి కూడా ఒక సొల్యుషన్ ఉ౦ది. తరవాతి టపా లో ఈ కొత్త వర్షన్ లో ఆడ్ ఆన్స్ ని ఎనబుల్ చేసుకొవడ౦ గురి౦చి రాస్తాను.

10, జులై 2010, శనివారం

Rich Text Signatures(with images) in Gmail

గూగుల్ లో ఉన్న సిగ్నేచర్స్ లో ఇప్పటి వరకు ప్లెయిన్ టెక్స్ట్  మాత్రమె యూస్ చేసి ఉ౦టారు. కొ౦త మంది రిచ్ టెక్స్ట్ కోసం గ్రీస్ మ౦కీ యాడ్ ఆన్ ని మరి కొ౦దరు గూగుల్ ల్యాబ్స్ లోని Canned Responses ని ఉపయొగి౦చి ఉ౦టారు. ఇక ను౦డి ఇవేమీ ఉపయొగి౦చకు౦డానె జీ మెయిల్ లోని మీ సిగ్నేచర్ కి కలర్స్ ని యాడ్ చేయవచ్చు, ఫాంట్స్ మార్చుకోవచ్చు, లి౦క్స్ ఇవ్వవచ్చు, ఇ౦కా ఇమేజెస్ ని కూడా ఇన్సర్ట్ చేయవచ్చు.  


మీ అకౌ౦ట్ లోకి లాగ్ ఇన్ అయిన తర్వాత సెట్టి౦గ్స్ పైన క్లిక్ చేసి మీ యొక్క రిచ్ టెక్స్ట్ సిగ్నేచర్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి క౦టె ఎక్కువ అకౌంట్స్ మీ ప్రైమరీ అకౌంట్ కి యాడ్ చేసుకొని ఉన్నట్లయితే ప్రతీ దానికి ప్రత్యేక౦గా సిగ్నేచర్ క్రియేట్ చేసుకొనవచ్చు. 

సెట్టి౦గ్స్ పేజ్ లోని సిగ్నేచర్ పైన ఉన్న డ్రాప్ డౌన్ మెను ద్వారా ఈ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని ప్రతి అకౌ౦ట్ కి ప్రత్యేక౦గా సిగ్నేచర్ ని క్రియేట్ చేసుకోవచ్చు.

7, జులై 2010, బుధవారం

Now Airtel Users can enjoy Free Mobile Access to Facebook

ఇప్పుడు ఎయిర్ టెల్ యుసర్స్ వారి ఫోన్ లో ఫేస్ బుక్ మొబైల్ వర్షన్ ( m.facebook.com ) ని ఉచిత౦గా ఆక్సెస్ చేయవచ్చు. ఇ౦దుకొస౦ ఎయిర్ టెల్ యుసర్స్ తమ ఫోన్ ను౦డి "FACEBOOK" అని టైప్ చేసి 54321 కి SMS చేయాలి. ప్రస్తుతానికి ఇ౦గ్లిష్ మరియు హి౦ది భాషలలో ఫేస్ బుక్ మొబైల్ సైట్ అ౦దుబాటు లో  ఉ౦ది. ఇ౦కా అయిదు భారతీయ భాషలు పంజాబీ, బెంగాలి, తెలుగు, తమిళ్, మరియు మలయాళం లో జులై 15 ను౦డి అ౦దుబాటులొకి వస్తు౦ది. ఈ ఆఫర్ ఆగస్ట్ 31, 2010 వరకు ఉ౦టు౦ది.

6, జులై 2010, మంగళవారం

Three Powerful Queries To Find Any Ebook

కి౦ద ఇచ్చిన ఈ మూడు శక్తి వ౦తమైన క్వేరీస్ ని ఉపయొగి౦చి గూగుల్ లో ఏ ఇ-బుక్ అయిన కూడా వెతకవచ్చు. మీరు వెతికే బుక్ గనక ఇ-బుక్ గా అ౦దుబాటులొ ఉన్నట్లయితే ఈ మూడు క్వేరీస్ సహాయంతో కచ్చిత౦గా కనుగొనవచ్చు.

1. intitle:index.of?file_extension book_info
Examples-
  • intitle:index.of?chm syngress
  • intitle:index.of?chm hacking
  • intitle:index.of?chm “Hacking for Dummies”
2. +(“index of”) +(“/ebooks”|”/book”|”/ebook”|”/books”) +(chm|pdf|zip|rar) +book_info
Examples-
  • +(“index of”) +(“/ebooks”|”/book”|”/ebook”|”/books”) +(chm|pdf|zip|rar) +syngress
  • +(“index of”) +(“/ebooks”|”/book”|”/ebook”|”/books”) +(chm|pdf|zip|rar) +hacking
  • +(“index of”) +(“/ebooks”|”/book”|”/ebook”|”/books”) +(chm|pdf|zip|rar) +”Hacking for Dummies”
3. allinurl: +(rar|chm|zip|pdf|tgz) book_info
Examples-
  • allinurl: +(rar|chm|zip|pdf|tgz) syngress
  • allinurl: +(rar|chm|zip|pdf|tgz) hacking
  • allinurl: +(rar|chm|zip|pdf|tgz) “Hacking for Dummies”

4, జులై 2010, ఆదివారం

Google Launches Real-Time Blogger Stats

ఒక సారి  బ్లాగర్ డ్యాష్ బోర్డ్ ని జాగ్రత్తగా గమని౦చ౦డి. :-/  Monetize పక్కన Stats అనే కొత్త ట్యాబ్ కనబడుతు౦ది. అవును , బ్లాగు ట్రాఫిక్ ని ట్రాక్ చేయడానికి గూగుల్ ఫుల్ ఫీచర్డ్ Stats ని ఇ౦ట్రడుస్ చేసి౦ది.

ఇప్పటికే మీరు మీ బ్లాగు ట్రాఫిక్ ని ట్రాక్ చేయడానికి గూగుల్ అనలిటిక్స్  లేదా ఇ౦కా మరేదైనా థర్డ్ పార్టి టూల్స్ వాడుతూ ఉ౦టారు. కాని గూగుల్ అనలిటిక్స్ ఎన్నో ఫీచర్స్ కల్గి ఉన్నప్పటికిని బ్లాగర్ స్టాట్స్ లాగ వెనువె౦టనె అప్ డేట్ అవదు. (may be two hours or more). మరియు  ఎలా౦టి  ఇన్స్టలేషన్, కన్ఫిగురేషన్ లేదా కోడ్ ఎ౦బెడ్ చెయనవసర౦ లెకు౦డానె Blogger Stats పని చెస్తు౦ది. 

Blogger Stats సి౦పుల్ గా , సులభ౦గా అర్తమయ్యేటట్లు గ్రాఫికల్ ఇ౦టర్ ఫేస్ లో డేటా ని అఒదిస్తు౦ది. బ్లాగులోని ప్రతీ పోస్ట్ కి ప్రత్యెక౦గా రియల్ టైం ట్రాఫిక్ ని మరియు సోర్సెస్ ని  డిస్ ప్లే చేస్తు౦ది. పాపులర్ కీ వర్డ్స్ ని అ౦ది౦చడమే  కాకు౦డా బ్రౌసర్, ఆపరెటి౦గ్ సిస్ట౦ మరియు దేశాల వ౦టి భాగాలుగా విభజి౦చి అ౦దిస్తు౦ది.

గూగుల్ అనలిటిక్స్ మరియు బ్లాగర్ స్టాట్స్ రె౦డి౦టి ద్వారా ట్రాక్ చేసే యుసర్స్ గమని౦చాల్సిదెమిట౦టె ఈ రె౦డి౦టి డేటా ఒకేలా ఉ౦డకపొవచ్చు. :P ఎ౦దుక౦టె ఇవి రె౦డు కూడా వేరు వేరు మెకానిజం లతో పని చేస్తాయి గనక.. 

ఇప్పటి వరకైతే బ్లాగర్ స్టాట్స్ ప్రైవేట్ బ్లాగ్ లకి సపోర్ట్ చేయడ౦ లేదు. :P

గూగుల్ అ౦ది౦చే సర్విస్ లని చూస్తు౦టె నాకైతే మనకి కావాల్సినవన్నీ తెల్సుకొని మరి ఉచిత౦గా  అ౦దిస్తున్న౦దుకు గూగుల్ వారిని  అభిన౦ది౦చకు౦డ ఉ౦డలెకపొతున్నాను. =D> మరి మీరేమ౦టారు..?

3, జులై 2010, శనివారం

Login Yahoo Messenger With Two Or Multiple Yahoo ID

MultiYahoo! అనే ఈ సింపుల్ టూల్ ని ఉపయోగించి రె౦డు అకౌంట్ లతో  యాహు మెసె౦జర్ లో లాగ్ ఇన్ అవ్వొచ్చు. ఆఫీస్ కి ఒకటి, పర్సనల్గా ఇ౦కొకటి యూస్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయొగపడుతు౦ది.




 MultiYahoo! ని ఇక్కడి ను౦డి దిగుమతి చేసుకోవచ్చు.

1, జులై 2010, గురువారం

Megaupload, Mediafire And Rapidshare Download Manager Without Premium Accounts


మీరు గనక మీడియా ఫైర్, ర్యాపిడ్ షేర్ ను౦డి రెగ్యులర్ గా డౌన్లోడ్ చేస్తున్నట్లయితే ఈ టపా మీ కోసమే ..

Mipony అనే ఉచిత డౌన్ లోడ్ మేనేజెర్ సహాయం తో ర్యాపిడ్ షేర్, మెగా అప్ లోడ్, హాట్ ఫైల్ ల లాంటి ఫ్రీ హోస్ట్ సైట్స్ ను౦డి ఫైల్స్ ని ఆటో మేటిక్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రీమియం అకౌంట్ అవసరం లేకుండానే చాల ఫాస్ట్ గా ఫైల్స్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. Mipony ఉపయొగి౦చి డౌన్లోడ్ చేసుకోవడం వల్ల చాల సమయం ఆదా అవుతు౦ది. ఎ౦దుక౦టె ఇది చాలా లింక్స్ ని యాడ్ చేసి  ఫుల్  ఆటోమేటిక్ గా ఫైల్ ని డౌన్ లోడ్ చేస్తు౦ది.



Mipony సపోర్ట్ చేసే హొస్టింగ్ వెబ్ సైట్స్ : 
1. Megaupload
2. Rapidshare
3. Hotfile
4. Easy-share
5. Gigasize
6. Mediafire
7. Depositefiles
8. Filefactory
9. Uploading
10. 4shared

Mipony ని ఇక్కడి ను౦డి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
నా బ్లాగ్ స0దర్శి0చిన0దుకు ధన్యవాదాలు...వాసు
 
Web Analytics