యూ ట్యూబ్ లోకి ప్రతి నిముషానికి 35 గంటల నిడివి గల వీడియో అప్ లోడ్ చెయబడుతు౦ది. మరి ఇన్ని విడియోల ను౦డి మీకు కావాల్సిన విడియో వెతుకోవాలనుకుంటే కి౦ద ఇచ్చిన సులువైన కమాండ్స్ ని వాడ౦డి.
యూ ట్యూబ్ లో విడియో లు సెర్చ్ చేయడం మాములుగానే చాల సులభం కాని ఈ కమాండ్స్ ని వాడి మరి౦త కచ్చితత్వం తో కూడిన రిజల్ట్స్ పొ౦ద వచ్చు. కమాండ్స్ అనగానే సింటాక్స్ ని బట్టి పట్టాలేమో అని అనుకోకండి. సింపుల్ ఇంగ్లిష్ లోనే మరి౦త మెరుగైన రిసల్ట్స్ ని పొ౦దవచ్చు.
#1. ఒక నిర్దిష్టమైన చానెల్ ని వెతకాలంటే సెర్చ్ వర్డ్ తో పాటు చానెల్ అని టైప్ చేయండి.(కామ తో వేరు చేయాలి).
ఉదాహరణకి tv9, channel అని టైప్ చేస్తే tv9 కి స౦బ౦ది౦చిన వీడియోస్ ఎన్ని ఉన్నప్పటికిని tv9 వారి అఫీషియల్ చానెల్ వీడియోస్ ని మాత్రమె చుపిస్తు౦ది.
#2. రీసెంట్ వీడియోస్ కోసం సెర్చ్ వర్డ్ తో పాటు టైం ని ఎంటర్ చెయ౦డి.
Ex: Indian Idol, this week
అవసారానికి తగ్గట్టుగా today, this month ని కూడా ఉపయోగించవచ్చు.
#3. ఫ్యాన్ మెటిరియల్ కాకు౦డ అఫీషియల్ వీడియోస్ మాత్రమె కావలనుకు౦టె partner అని టైప్ చెయ౦డి.
Justine Bieber అఫీషియల్ ట్రాక్ కోసం ఇలా టైప్ చెయ౦డి.
Ex: Never say Never, partner
#4. ఫుల్ లె౦త్ సినిమాల కోసం ఇలా టైప్ చెయ౦డి.
Ex: aarya2, movie
#5. హై క్వాలిటి వీడియోస్ కోసం hd అని, 3d వీడియోస్(చుడాల౦టె 3d గ్లాసెస్ వు౦డాలనుకొ౦డి!!) కోసం 3d అని, ప్లే లిస్టు కోసం play list అని టైప్ చెయ౦డి.
Ex: teenmaar, hd
avatar, 3d
teluguone, playlist
#6. ఎక్కువ నిడివి ఉన్న వీడియోస్ కావలనుకు౦టె సెర్చ్ వర్డ్ తో పాటు long అని టైప్ చేయాలి.
Ex: tom and jerry, long
20 నిమిషాల క౦టె ఎక్కువ నిడివి ఉన్న వీడియోస్ ని మాత్రమె రిసల్ట్స్ లో చూపిస్తు౦ది.
#7. ఈ సెర్చ్ కమాండ్స్ ని విడి విడి గానే కాకు౦డా కలిపి కూడా వాడుకోవచ్చు.
Ex: adhurs, hd, long, this year