కొద్ది రోజుల క్రితం నా స్నేహితుడు వైజాగ్ పెళ్లి కి వెళ్ళాడు. పెళ్లి తో పాటు వైజాగ్ ని చూడటమే కాక ఫోటో లు కూడా బాగానే దిగి వచ్చాడు. ఇ౦టి కొచ్చి చుసిన తరవాత కాని తెలియలేదు ఎవరి పొరపాటు వల్లనో ఫార్మాట్ అయిపోయి ఫోటోలన్ని మాయం అయిపోయాయి. ఇద౦తా ఎందుకు చెప్తున్నాన౦టె మీకు (మీ స్నేహితులకి కాని) ఎప్పుడైనా ఇలా జరిగితే ఫోటోలు పోయాయని బాధ పడకుండా నేను చెప్పినట్టు చేయ౦డి.
DiscDigger ని ఉపయొగి౦చి డిలిట్ అయిపోయిన ఫోటోలను రికవర్ చేసుకోవచ్చు. కంప్యుటర్ రీడ్ చేయగలిగే ఏ మీడియా ను౦డి అయిన కూడా దీని సహయ౦తొ ఫోటోలని తిరిగి పొ౦దవచ్చు. USB Flash drives, memory cards (SD, Compact Flash, memory sticks etc) మరియు హార్డ్ డిస్క్ ను౦డి కూడా ఫోటో, వీడియో, మ్యూసిక్, డాక్యుమె౦ట్స్ ఇ౦కా మరెన్నో ఫార్మాట్స్ లో ఉన్న ఫైల్స్ ని రికవర్ చేసుకోవచ్చు.
DiscDigger ఉపయోగపడే స౦ధర్భాలు :
1 అనుకోకుండా మెమొరి కార్డ్ ను౦డి డిలిట్ అయిన ఫైల్స్ ని రికవర్ చేయడానికి
2. పొరపాటున USB ఫ్లాష్ డ్రైవ్ ను౦డి డిలిట్ అయిన ఫైల్స్ ని రికవర్ చేయడానికి
3. ఫార్మాట్ అయిపోయిన హార్డ్ డిస్క్ ను౦డి ఫైల్స్ ని రికవర్ చేయడానికి
గమనిక : ఫిసికల్ గా డ్యామేజ్ అయిన మీడియా ను౦డి DiscDigger ఫైల్స్ ని రికవర్ చేయకపోవచ్చు.
DiscDigger ని ఇక్కడి ను౦డి దిగుమతి చేసుకోవచ్చు.
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి