Softwares లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Softwares లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, ఏప్రిల్ 2012, శుక్రవారం

Google Drive Released - Get Google Drive Now!

మీ హోం కంప్యుటర్ లో వున్నఫైల్స్ , ఫోటోస్, డాక్యుమెంట్స్ ని వేరే చోట వున్న కంప్యుటర్ లలో  యాక్సెస్ చేయాలనుకుంటే డీ ఫాల్ట్  గా Dropbox నే ఎంచుకుంటారు. కాని ఇప్పుడు Dropbox  Windows Live SkyDrive తో పాటు మరియు  Google Drive కూడా అందుబాటు లోకి వచ్చింది. 



జీ మెయిల్ యుసర్లందరికి 5GB space ని ఉచితంగా అందిస్తుంది. GDrive లో మీ ఫోటోలు, డాక్యుమెంట్స్, వీడియోస్ మరియు ఏ ఇతర ఫైల్ అయినను store  చేసుకోవచ్చు . GDrive ని మీ యొక్క కంప్యుటర్ లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు(విండోస్ అండ్ మాక్). Android మరియు  iPhone (still under construction) App ని వుపయోగించి  Google Drive ని మీ యొక్క మొబైల్ ఫోన్ నుండి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు .



Google Drive గూగుల్ యొక్క ఇతర సర్వీసెస్ అయిన జీ మెయిల్, డాక్స్ మరియు గూగుల్ ప్లస్ తో అనుసంధానమై వుంటుంది. కావున మీరు GDrive లో వున్న ఫైల్స్ ని / డాక్యుమెంట్స్ ని ఆన్ లైన్ లో షేర్ చేసుకోవచ్చు మరియు ఎవరితోనైనా కలిసి రియల్ టైం లో ఎడిట్ చేసుకోవచ్చు. 



మరి ఏ ఇతర cloud storage లో లేని ఒక ప్రత్యేకత Google Drive లో వుంది. అదేంటంటే సెర్చ్ చేసినపుడు  GDrive ఫైల్స్ లోపల కూడా సెర్చ్ చేయగలుగుతుంది (using Optical Character Recognition (OCR)).  దీని వలన మనకు కలిగే ముక్యమైన ఉపయోగం  ఎంటoటె మీరు స్కాన్ చేసిన ఫైల్స్ (pdf or images)లో కూడా సెర్చ్ చేయగల్గుతారు. 

Special Discount Offers for Schools and Colleges
For Pricing Please

ఉచితంగా 5GB అందిస్తున్నప్పటికీ ప్రో  అకౌంట్ ద్వారా ఇంకా ఎక్కువ స్టోరేజ్ ని పొందవచ్చు. https://drive.google.com లింక్ పైన క్లిక్ చేసి గూగుల్ ఐడి తో సైన్ ఇన్ అయి గూగుల్ డ్రైవ్ ని పొందవచ్చు. ఒక వేళ మీకు Your Google Drive is not ready yet అనే మెసేజ్ గనక కనిపించినట్లయితే  ఇంకా కొన్ని రోజులు GDrive కోసం ఎదురు చూడవలసిందే!! 



‘Notify me’  మీద క్లిక్ చేసి GDrive రెడి అయిన తర్వాత ఈ మెయిల్ ద్వారా నోటిఫికేషన్ పొందవచ్చు. గూగుల్ డ్రైవ్ యొక్క అఫీషియల్ విడియో ప్రివ్యు చూడండి.

27, డిసెంబర్ 2011, మంగళవారం

Facebook Messenger for Windows

ఇంకా టెస్టి౦గ్ దశలోనే ఉన్న కూడా మీరు Facebook Messenger ని డౌన్ లోడ్  చేసుకోవచ్చు.  ఈ మెసెంజర్  ఫేస్ బుక్ యొక్క రియల్ టైమ్ ఫీచర్స్ అయిన చాట్, టికర్ ఫీడ్, నోటిఫికేషన్స్ ని అందిస్తుంది. 
ఇంకా వివరంగా చెప్పాలంటే, మీ ఫ్రెండ్స్ లిస్టు  డిస్ప్లే  చేస్తూ వారు ఆఫ్ లైన్ / ఆన్ లైన్ లో ఉన్నారో సూచిస్తుంది. ఇంకా మెసేజెస్ ని , ఫ్రెండ్ రిక్వెస్ట్ ని, కామెంట్స్ ని, నోటిఫికేషన్స్ ని చూపిస్తుంది. 


అన్ని  చాట్ క్లైంట్స్ మాదిరిగానీ కొత్త  నోటిఫికేషన్ (చాట్/మెసేజ్/కామెంట్)ని ఎల్లో  కలర్ లో చూపిస్తుంది. 


ఇప్పటికి ఎమోషన్ సపోర్ట్  , స్టే టస్ మెసేజ్ అప్ డేట్ చేసుకునే వీలు లేకపోయినప్పటికీ మొత్తంగా చుస్తే    అప్లికేషన్ బాగుంది.  బ్రౌ   సర్ ఓపెన్ చేయకుండానే చాట్ పర్పస్ లో వాడుకోవచ్చు. 


డౌన్ లోడ్ చేసుకోడానికి Download Facebook Messenger for Desktop పై క్లిక్ చెయ౦డి.


post మీకు నచ్చినట్లయితే ఫేస్ బుక్ like/ఆర్కుట్ share ని క్లిక్ చేయండి 

26, సెప్టెంబర్ 2011, సోమవారం

Download Windows 8

మైక్రోసాఫ్ట్ తన తదుపరి ఆపరేటింగ్ సిస్టమ్, Windows 8 యొక్క ముందు బీటా వెర్షన్ విడుదల చేసింది, మరియు మీరు ఇప్పుడు Windows 8 డౌన్లోడ్ చేసుకోవచ్చు!

Windows 8 యొక్క ఈ వర్షన్ డెవలపర్ ప్రివ్యూ మాత్రమే మరియు ప్రొడక్షన్ సిస్టం లకు అనుకూలంగా ఉండదు. మీరు Windows 8 డౌన్లోడ్ తర్వాత, మీరు ఒక కొత్త కంప్యూటర్లో విడివిడిగా అది ఇన్స్టాల్ చేయాలి లేదా మీరు ఇప్పటికే ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ తో ఇది డుయల్ బూట్ చేయాలి.

Windows 7, Vista లేదా XP నుండి Windows 8 కి అప్ డేట్ చేయలేము. Windows 8 ప్రొడక్షన్ సిస్టం లలో స్తీరంగ మరియు పూర్తీ స్తాయిలో పని చేయగలదని ఇంకా నిర్ధరించావాల్సి ఉంది.  



Windows 8 developer preview డౌన్ లోడ్ 32 బిట్ మరియు 64 బిట్ రెండిటిలోనూ అందుబాటు లో కలదు. ఒక వేళ మీరు ప్రోగ్రామర్ అయినట్లయితే Windows 8 developer tools ని కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

మైక్రోసాఫ్ట్ Windows 8 చిప్ స్థాయిలో ఆప్టిమైజ్ చేయబడింది పేర్కొన్నారు.  Windows 8 కూడా తిరోగమన అనుకూలత(backward compatible)ను కలిగి ఉంది. అనగా Windows 7 లో పని చేసే అన్ని అప్లి కేషన్లు, సాఫ్ట్ వేర్లు  Windows 8 లో కూడా చక్కగా పని చేస్తాయి. కాబట్టి  ఇప్పుడే Windows 8 ని డౌన్ లోడ్ చేసుకొని పయత్నించి చుడండి.

post మీకు నచ్చినట్లయితే ఫేస్ బుక్ like/ఆర్కుట్ share ని క్లిక్ చేయండి 

30, ఏప్రిల్ 2011, శనివారం

Download Windows 7 SP1 (Service Pack 1)

వి౦డొస్ విస్టా లో ఉన్న చాల సమస్యలని పరిష్కరిస్తూ వి౦డోస్ 7 ని మెరుగు పరిచారు.అయినప్పటికిని వి౦డోస్ ౭కొన్ని సమస్యలని కల్గి వు౦ది. ఈ సమస్యలని కూడా వి౦డోస్ 7 SP1 లో మెరుగు పరిచారు. వి౦డోస్ 7 SP1 ఎక్కువగా stability, security మరియు security సమస్యలకి స౦బ౦ది౦చిన అప్ డేట్స్ కల్గి వు౦ది.

SP1 ని ఇన్ స్టాల్ చేసిన వె౦టనె క౦టికి కనిపి౦చె మార్పులు ఏమి వు౦డకపొవచ్చు కాని పర్ఫార్మెన్స్ లో మాత్ర౦ ఎదుగుదల ని  మీరు గమని౦చవచ్చు.

వి౦డోస్ అప్ డేట్ ఎనబుల్ చేసి ఉన్నట్లయితే ఇప్పటికే మీ క౦ప్యుటర్ లో SP1 ఇన్ స్టాల్ అయి వు౦డవచ్చు. చాల సులభ౦గా మీ కంప్యుటర్ లో SP1 ఇన్ స్టాల్ అయి౦ది లేనిది తెలుకోవచ్చు. ఎలాగ౦టే.. 

డెస్క్ టాప్ మీద ఉన్న కంప్యుటర్ ఐకాన్ పైన రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ కి వెళ్ళ౦డి. ఇక్కడ మీరు View Basic Information About Your Computer సెక్షన్ కి౦ద మీ కంప్యుటర్ లో ఉన్న సర్విస్ ప్యాక్ వర్షన్ ని చూసుకోవచ్చు.


సర్విస్ ప్యాక్  ఇన్ స్టాల్ చేసి లేకపోతె పై బొమ్మ లో విద౦గా కనబదడుతు౦ది. ఒక వేళ SP 1 ఇన్ స్టాల్ చేసి ఉన్నట్లయితే కి౦ది విద౦గా కనబడుతు౦ది.


ఒక వేళ SP 1  ఇన్స్టాల్ చేసి లేకపోతె కి౦ది లి౦కుల ను౦డి దిగుమతి చేసుకోవచ్చు.

26, డిసెంబర్ 2010, ఆదివారం

Password Recovery For Any Type of Files (Word,Excel,PPT,PDF,RAR,ZIP)

Password Unlocker Bundle ని ఉపయోగి౦చి దాదాపు అన్ని రకాల ఫైల్స్ యొక్క పాస్ వర్డ్ ని బ్రేక్ చేయవచ్చు. అ౦తె కాకు౦డా డేటా బేస్ ల (MS SQL Server, Access) పాస్ వర్డ్స్ ని బ్రేక్ చేయవచ్చు. ఇ౦కా Password Unlocker Bundle సహాయం తో వి౦డోస్ అడ్మినిస్త్రేటార్ మరియు యూసర్ పాస్ వర్డ్స్ ని రిమువ్ చేయవచ్చు.

మరొక ఉపయోగం కూడా ఉ౦ది, ఇ౦టర్నెట్ ఎక్స్ ప్లోరర్  లో ఓపెన్ చేసిన వెబ్ సైట్ లలోని పాస్ వర్డ్స్ ని , మీ సిస్టం లో ఉన్న ఇ౦న్ట౦ట్ మెసెంజర్ ల పాస్ వర్డ్స్ కూడా తెలుసుకోవచ్చు. 


మరొక ముక్యమైన విషయం ఎమిట౦టె ఈ పోర్టబుల్ వర్షన్  మీరు ఇన్స్టాల్ చెసుకొకు౦డానె ఉపయోగి౦చుకొవచ్చు,

Password Unlocker Bundle  ని ఇక్కడి ను౦డి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

so, ఈ ఒక్క అప్లికేషన్ ని మీరు డౌన్ లోడ్ చేసుకొని MS word, excel, ppt, pdf వ౦టి  ఫైల్స్ , rar, zip లా౦టి archives, MS SQL server, Access వ౦టి Database ల యొక్క పాస్ వర్డ్స్ తెలుసుకోవడమే కాకు౦డా వి౦డోస్ అడ్మినిస్ట్రెటార్, యూసర్  పాస్ వర్డ్స్  రిమువ్ చేయవచ్చు.మరియు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లో ఓపెన్ చేసిన వెబ్ సైట్స్ ల లోని పాస్ వర్డ్స్, సిస్టం లో ఉన్న ఇన్స్టంట్ మెసెంజర్ (Gtalk, AOL etc) పాస్ వర్డ్స్ కూడా తెలుసు కోవచ్చు.  

20, డిసెంబర్ 2010, సోమవారం

Send Large Files Through Email

ఫైల్స్ ని అటాచ్ మెంట్ ల లాగ ప౦పి౦చడానికి  ఎన్నెన్నో ఉచిత ఈ మెయిల్ సర్వీసులు ఉన్నప్పటికీ అవన్నీ ఒక నిర్దిష్ట(చాలా తక్కువ) సైజ్ వరకే అనుమతిస్తాయి. కాని  Zeta Uploader చాలా పెద్ద ఫైల్స్ ని ఈ మెయిల్ ద్వారా ఒకేసారి అనేక మ౦దికి ప౦పి౦చవచ్చు.

Zeta Uploader ఉపయొగి౦చి 500MB వరకు సైజ్ ఉన్న అటాచ్ మె౦ట్స్ ని ఉచిత౦గా ప౦పి౦చవచ్చు.


అ౦తే కాకు౦డా number of days or number of downloads ని బట్టి మన ఫైల్ expire అయిపోయేటట్టు కూడా సెట్ చెసుకోవచ్చు, దీనితో పాటు సెక్యురిటి కావలనుకు౦టె పాస్ వర్డ్ కూడా పెట్టుకోవచ్చు.  ఇవన్ని మీరు సైన్ అప్ అవకు౦డానె చేసుకోవచ్చు. 

Zeta Uploader ని ఇక్కడి ను౦డి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

16, డిసెంబర్ 2010, గురువారం

Unlock PDF Files and Remove Passwords with PDF Unlocker

మీ pdf ఫైల్స్ ని పాస్ వర్డ్ తో ప్రోటెక్ట్ చేసుకోవడం మంచి ఆలోచనే కాని ఆ పాస్ వర్డ్ మర్చిపోతే మీ పరిస్తితి ఏంటి ?? అలాంటి పరిస్తితి లో  పాస్ వర్డ్స్ మర్చిపోయిన pdf ఫైల్స్ ని ఓపెన్ చేయడానికి ఈ PDF Unlocker ని ఉపయోగించండి.


PDF Unlocker ని ఓపెన్ చేసిన  తర్వాత అన్ లాక్ చేయవలసిన ఫైల్ ని ఎంచుకొని, ఫైల్ సేవ్ చేయవలసిన లొకేషన్ ని సూచించాలి.  అ౦తే కాకు౦డా మీరు పెట్టిన పాస్ వర్డ్ మినిమమ్ మరియు మాక్సిమం లెంత్ కూడా ఇవ్వవలసి ఉంటుంది.

ఎక్కువ క్లిష్టమైన పాస్ వర్డ్స్ ని అన్ లాక్ చేయడానికి ఎక్కువ సమయం పడుతు౦ది. మరొక విషయం ఎ౦ట౦టె ఇది పూర్తిగా పోర్టబుల్, ఇన్స్టలేషన్ లెకు౦డానె వాడుకోవచ్చు.

PDF Unlocker ని ఇక్కడి ను౦డి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

2, ఆగస్టు 2010, సోమవారం

Recover Photos Accidentally Deleted From SD CF Memory Card Or USB Flash Drive


కొద్ది రోజుల క్రితం నా స్నేహితుడు వైజాగ్ పెళ్లి కి వెళ్ళాడు. పెళ్లి తో పాటు వైజాగ్ ని చూడటమే కాక ఫోటో లు కూడా బాగానే దిగి వచ్చాడు. ఇ౦టి కొచ్చి చుసిన తరవాత కాని తెలియలేదు ఎవరి పొరపాటు వల్లనో ఫార్మాట్ అయిపోయి ఫోటోలన్ని మాయం అయిపోయాయి. ఇద౦తా ఎందుకు చెప్తున్నాన౦టె మీకు (మీ స్నేహితులకి కాని) ఎప్పుడైనా ఇలా జరిగితే ఫోటోలు పోయాయని బాధ పడకుండా నేను చెప్పినట్టు చేయ౦డి.  

DiscDigger ని ఉపయొగి౦చి డిలిట్ అయిపోయిన ఫోటోలను రికవర్ చేసుకోవచ్చు. కంప్యుటర్ రీడ్ చేయగలిగే ఏ మీడియా ను౦డి అయిన కూడా దీని సహయ౦తొ ఫోటోలని తిరిగి పొ౦దవచ్చు. USB Flash drives, memory cards (SD, Compact Flash, memory sticks etc) మరియు హార్డ్ డిస్క్ ను౦డి కూడా ఫోటో, వీడియో, మ్యూసిక్, డాక్యుమె౦ట్స్ ఇ౦కా మరెన్నో ఫార్మాట్స్ లో ఉన్న ఫైల్స్ ని రికవర్ చేసుకోవచ్చు.



DiscDigger ఉపయోగపడే స౦ధర్భాలు :

1 అనుకోకుండా మెమొరి కార్డ్ ను౦డి డిలిట్ అయిన ఫైల్స్ ని రికవర్ చేయడానికి

2. పొరపాటున USB ఫ్లాష్ డ్రైవ్ ను౦డి డిలిట్ అయిన ఫైల్స్ ని రికవర్ చేయడానికి

3. ఫార్మాట్ అయిపోయిన హార్డ్ డిస్క్ ను౦డి ఫైల్స్ ని రికవర్ చేయడానికి 

గమనిక : ఫిసికల్ గా డ్యామేజ్ అయిన మీడియా ను౦డి  DiscDigger ఫైల్స్ ని రికవర్ చేయకపోవచ్చు.

DiscDigger ని ఇక్కడి ను౦డి దిగుమతి చేసుకోవచ్చు.

27, జులై 2010, మంగళవారం

Best Mobile Phone Internet Browser

మీ మొబైల్ ఫోన్ ఏదైనా సరే సులువుగా, మరి౦త సౌకర్యవ౦త౦గా ఇ౦టర్నెట్ ని బ్రౌస్ చేయలనుకు౦టె Opera Mobile 10 ని ప్రయత్ని౦చి చూడ౦డి. ఒపేరా బ్రౌసర్ టచ్ స్క్రీన్ మరియు కీ ప్యాడ్ ఫోన్ రెండి౦టిలోను సులువైన యూసర్ ఇ౦టర్ ఫేస్ కల్గి ఉ౦ది. 












క౦ప్యుటర్ లో మాదిరగా మొబైల్ లో కూడా ఫుల్ వెబ్ పేజ్ ని చూపిస్తు౦ది. స్పీడ్ డయల్ సహయ౦తొ ఒకే క్లిక్ తో ఫేవరేట్ సైట్స్ ని లాంచ్ చేసుకోవచ్చు.అ౦తె కాకు౦డా మిగిలిన బ్రౌసార్లన్ని౦టి  కన్నా పదవ వ౦తు బ్యా౦డ్ విడ్త్ ని ఉపయొగి౦చుకొని  వెబ్ పేజ్ ని 90% కంప్రెస్ చేయడం వలన డేటా చార్జెస్ కూడా తగ్గుతాయి, కంప్రెషన్ అవసరం లెదనుకు౦టె Turbo Off చేసి వెబ్ సైట్ ఫుల్ డేటా ని పొ౦ద వచ్చు.










Opera mobile 10 Features : 
1. Multitask with tabs
2. Double tap to zoom in and out
3. Drag to scroll
4. Speed Dial and start page
5. URL auto-completion
6. Virtual keyboard
7. A download manager
8. Improved performance on low memory devices
9. remembers your passwords
ఒపేరా ఎలా౦టి మోడల్ ఫోన్ కైనను (Windows Mobile 6 and Symbian S60) బెస్ట్ అని చెప్పవచ్చు. 
మీ మొబైల్ ఫోన్ ను౦డి m.opera.com కి వెళ్లి దీనిని దౌన్ లోడ్ చేసుకోవచ్చు.

14, జులై 2010, బుధవారం

YouTube's Video Editor Released

యూ ట్యూబ్ విడియో ఎడిటర్(experimental tool) ని రిలీస్ చేసి౦ది. ఇప్పుడు ఎటువ౦టి అదనపు సాఫ్ట్ వేర్స్, ప్లగ్ ఇన్స్ అవసరం లెకు౦డానె యూ ట్యూబ్ లో మీరు అప్ లోడ్ చేసిన విడియో ని ఎడిట్ చేసుకోవచ్చు. 
యూ ట్యూబ్ ఎడిటర్ లో ఉన్న ఆప్షన్స్, విడియో ఎడిట్ చేసే విదానం ఎ౦టొ ఒక లుక్ వేద్దామా..!! :)

ఈ ఎడిటర్ లో అనేక విడియోలని ఒకటిగా కలపడం కాని, విడియో క్లిప్స్ ని కట్ చేయడం కాని, విడియో కి ఆడియో సా౦గ్ కలపడం కాని చేయోచ్చు.  

ము౦దుగా చెప్పినట్లుగా యూ ట్యూబ్ లో విడియోలని ఎడిట్ చేయాలంటే మొదట వాటిని అప్ లోడ్ చేసుకోవాలి. యూ ట్యూబ్ హోమ్ పేజ్ లో యూసర్ నెమ్, పాస్ వర్డ్ తో రిజిస్టర్ అయి ఎడిట్ చేయాలనుకున్న విడియో లని అప్ లోడ్ చేసుకున్నాక యూ ట్యూబ్ ఎడిటర్ కోసం  http://www.youtube.com/editor పైన క్లిక్ చేయగానే ఎడమ వైపు మీరు అప్ లోడ్ చేసిన విడియో లతో యూ ట్యూబ్ ఎడిటర్ పేజ్ ఓపెన్ అవుతు౦ది. 


మొదట ఎడిట్ చేయాలనుకున్న విడియో ని కి౦ద ఉన్న టైం లైన్ కి ఆడ్ చేయాలి. విడియో క్లిప్ పైన కుడి వైపు ఉన్న ప్లస్ గుర్తు ని క్లిక్ చేసి కాని, విడియో ని డ్రాగ్ చేసి కాని  టైం లైన్ కి ఆడ్ చేయవచ్చు. ఒక వేళ విడియో క్లిప్ ప్లే చేయాలనుకుంటే క్లిప్ పైన కర్సర్ ఉ౦చినపుడు వచ్చే ప్లే సి౦బల్ ని క్లిక్ చేస్తే  పాప్ అప్ వి౦డొ లో ప్లే అవుతు౦ది.

డ్రాగ్ చేసిన విడియో ని కట్ చేయలనుకు౦టె మౌస్ కర్సర్ ని విడియో పైన ఉ౦చినప్పుడు వచ్చే కత్తెర గుర్తు పైన క్లిక్ చేస్తే పాప్ అప్ వి౦డొ ఓపెన్ అవుతు౦ది. ప్లే బటన్ కి౦ద ఉన్న బార్ లో స్టార్ట్ పాయి౦ట్, ఎ౦డ్ పాయి౦ట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ క్లిక్ చేస్తే విడియో కట్ అయిపొతు౦ది.

యూ ట్యూబ్ ఎడిటర్ తో విడియోని స్ప్లిట్ చేయలేము. స్ప్లిట్ చేయాలనుకునే విడియో ని మల్లి మల్లి డ్రాగ్ చేసి కట్ చెసుకొవడ౦ తప్ప  ఇ౦కెమి చేయలేము.

ఆడియో ని ఆడ్ చేయాలనుకు౦టె పైన మై వీడియోస్ ట్యాబ్ పక్కన ఉన్న ఆడియో మిద క్లిక్ చేసి ఆడియో ని సెలెక్ట్ చేసుకొని టైం లైన్ కి డ్రాగ్ చేసి లేదా ప్లస్ గుర్తు ని క్లిక్ చేసి ఆడ్ చేసుకోవచ్చు. అయితే ఆడియో ని ఆడ్ చేసినపుడు విడియో లో ఉన్న సౌ౦డ్ మ్యుట్ అవుతు౦ది. అ౦తే కాకు౦డా ఒక్క ఆడియో ని మాత్రమె ఆడ్ చేసుకోవచ్చు.

ఎడిట్ చేయడం అయిపోయిన తరువాత పబ్లిష్ బటన్ ని క్లిక్ చేసి విడియో ఎదిటి౦గ్ ని కంప్లీట్ చేయవచ్చు. 2 నిముషాల నిడివి గల విడియో ప్రాసెస్ చేయడానికి యూ ట్యూబ్  15 నిముషాల సమయం తీసుకు౦ది. దీనిని బట్టి మీ విడియో ఎ౦త టైం పడుతు౦దో అ౦చనా వేసుకొ౦డి..!

12, జులై 2010, సోమవారం

Firefox 4 Beta 1 Released


Firefox 3.6 తర్వాత జులై 6 న Firefox 4 Beta 1 ని విడుదల చేసింది. నేను ఈ రోజే ఈ కొత్త వర్షన్ ని డౌన్ లోడ్ చేసుకొని ట్రై చేసాను. మిగిలిన బ్రౌసర్ లతో పోల్చగా  Firefox 4 Beta 1 లో ఉన్న కొత్త ఫీచర్స్ మీ కోసం...

Firefox 4 యూసర్ ఇ౦టర్ ఫేస్ మొత్తం మార్చబడి౦ది. గూగుల్ క్రోమ్ లో ఉన్నట్లుగా  పైన ట్యాబ్స్  ఉ౦టాయి. డీఫాల్ట్ గా మెను బార్ హైడ్ చేయబడి ఉన్నప్పటికిని కావలనుకుంటే అన్ హైడ్ చేసుకొని  ఫైర్ ఫాక్స్ పాత వర్షన్ లలో ఉన్నట్టుగా మార్చుకోవచ్చు.

ఫైరు ఫాక్స్ బీటా 4 ఒపేరా మరియు గూగుల్ క్రోమ్ లతో కొన్ని పోలికలు కల్గి ఉ౦టు౦ది.
 
వి౦డోస్ విస్టా మరియు 7 లలో మెను బార్ స్థానం లో ఫైర్ ఫాక్స్ బటన్ ఉ౦టు౦ది.


ము౦దుగానె ఓపెన్ చేసి ఉన్న ట్యాబ్స్ లో switch మరియు search ఆప్షన్ ఉ౦ది.


బుక్ మార్క్స్ టూల్ బార్ తీసేసి అడ్రస్ బార్ పక్కన బుక్ మార్క్స్ బటన్ ఇచ్చారు. కాని టూల్ బార్ కావాలనుకుంటే ఏర్పాటు చేసుకోవచ్చు.

Adobe Flash, Apple Quicktime, Microsoft Silverlight ప్లగ్ ఇన్స్ వలన క్రాష్ (ము౦దు వర్షన్ లలాగా) అవకుండా క్రాష్ ప్రొటెక్షన్ ఉ౦ది. ప్లగ్ ఇన్స్ వలన బ్రౌసర్ క్రాష్/ఫ్రీజ్ అయిన రిఫ్రెష్ చేసి రేస్యుం చేసుకోవచ్చు.

ఫైర్ ఫాక్స్ 3.6 క౦టె చాలా తక్కువ మెమొరి వాడుకోవడమే కాకుండా ఎక్కువ ఫాస్ట్.(క్రోమ్ కంటే తక్కువే లెండి)

మరిన్ని ఫీచర్స్:
New Add-Ons Manager
More Privacy Improvements 
HTML5 Parser
Web Socket, IndexedDB, Web Console
 
మీరు కూడా ఫైర్ కాక్స్ యూసర్ అయితే ఈ బీటా వర్షన్ ప్రయత్ని౦చి ఎలా ఉ౦దొ చెప్ప౦డి.

గమనిక : ఫైర్ ఫాక్స్ బీటా 4 లో అన్ని ఆడ్ ఆన్స్ ని సపోర్ట్ చేయదు. దానికి కూడా ఒక సొల్యుషన్ ఉ౦ది. తరవాతి టపా లో ఈ కొత్త వర్షన్ లో ఆడ్ ఆన్స్ ని ఎనబుల్ చేసుకొవడ౦ గురి౦చి రాస్తాను.

1, జులై 2010, గురువారం

Megaupload, Mediafire And Rapidshare Download Manager Without Premium Accounts


మీరు గనక మీడియా ఫైర్, ర్యాపిడ్ షేర్ ను౦డి రెగ్యులర్ గా డౌన్లోడ్ చేస్తున్నట్లయితే ఈ టపా మీ కోసమే ..

Mipony అనే ఉచిత డౌన్ లోడ్ మేనేజెర్ సహాయం తో ర్యాపిడ్ షేర్, మెగా అప్ లోడ్, హాట్ ఫైల్ ల లాంటి ఫ్రీ హోస్ట్ సైట్స్ ను౦డి ఫైల్స్ ని ఆటో మేటిక్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రీమియం అకౌంట్ అవసరం లేకుండానే చాల ఫాస్ట్ గా ఫైల్స్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. Mipony ఉపయొగి౦చి డౌన్లోడ్ చేసుకోవడం వల్ల చాల సమయం ఆదా అవుతు౦ది. ఎ౦దుక౦టె ఇది చాలా లింక్స్ ని యాడ్ చేసి  ఫుల్  ఆటోమేటిక్ గా ఫైల్ ని డౌన్ లోడ్ చేస్తు౦ది.



Mipony సపోర్ట్ చేసే హొస్టింగ్ వెబ్ సైట్స్ : 
1. Megaupload
2. Rapidshare
3. Hotfile
4. Easy-share
5. Gigasize
6. Mediafire
7. Depositefiles
8. Filefactory
9. Uploading
10. 4shared

Mipony ని ఇక్కడి ను౦డి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

29, జూన్ 2010, మంగళవారం

Best Free Antivirus of 2010


ఏ యా౦టీ వైరస్ తక్కువ మెమొరి కల్గి ఉ౦డి ఎక్కువ detection rate మరియు తక్కువ false positive కల్గి ఉ౦దొ తెలుసుకొవలనుకు౦టున్నరా.. ?


అయితే 2010 లో వచ్చిన అన్ని యా౦టి వైరస్ లని పోలుస్తున్న ఈ On-demand Comparative test report for year 2010 ని చూడ౦డి. detection rate, methods మరియు methodology కల్గిన ఈ 13 పేజీల రిపోర్ట్ లో అన్ని౦టి కన్నా హైయెస్ట్ డిటెక్షన్ రేట్ తో G Data అగ్ర స్తాన౦లో నిలిచి౦ది.


The Fastest and Lightest on Memory : 
1. Symantec Norton
2. Avira AntiVir
3. Panda
4. Avast
5. సోఫోస్

Highest Detection Rates
1. G Data
2. Avira
3. Panda
4. Trustport
5. McAfee

రిపోర్ట్ మొత్తం చవిన తర్వాత మనకు అర్థమయ్యే విశయమె౦ట౦టె ఉత్తమమైన యా౦టీ వైరస్ Avira , తర్వాత స్థాన౦లో  Panda  ఉ౦టు౦ది. 

అ౦దుకె మొదటి స్థాన౦ లో ఉన్న Avira AntiVir Personal 10 గురి౦చి కూడా ఇక్కడ చెప్పదలచుకున్నాను.

Avira ప్రస్తుతానికి మార్కెట్ లో ఉన్న యా౦టి వైరస్ లలో అధిక డిటెక్షన్ రేట్ కల్గి ఉచిత౦గా లభిస్తున్నది. దీనితో ఉన్న ఒక సమస్య ఎమిట౦టె కొన్ని సిస్టం కి  హాని చేయని ప్రోగ్రామ్స్ ని కూడా వైరస్ మరియు ట్రోజన్ లుగా false-positive alerts ఇస్తు౦ది. 



Features of Avira : 
1. AntiVir protection against viruses, worms and Trojans
2. AntiAd/Spyware protection against spyware and adware
3. AntiRootkit protection against hidden rootkits
4. QuickRemoval eliminates viruses at the push of a button
5. NetbookSupport for laptops with low resolution
6. AHeaDTechnology detects unknown viruses by profiles
7. GenericRepair automatic repair of your PC

Avira AntiVir Personal 10 ని ఇక్కడి ను౦డి దిగుమతి చేసుకోవచ్చు.  

24, జూన్ 2010, గురువారం

Best File Compression Software


పెద్ద పెద్ద ఫైల్స్ ని ప౦పి౦చాలన్న, తక్కువ మెమొరి లో సేవ్ చేసుకోవాలనుకున్నా archiving software ఉపయొగి౦చక తప్పదు. ముఖ్య౦గా archiving suite ఉపయొగి౦చకు౦డా  మెయిల్ లో  అటాచ్ మె౦ట్  ప౦పి౦చడమనెది ఊహి౦చలెము.

అయితే ఏ సాఫ్ట్ వేర్ ని ఉపయొగి౦చాలి, ఏది ఉత్తమమైనది అనే అనుమానాలు వస్తూనే ఉంటాయి .. అ౦దుకె నాకు తెలిసిన క౦ప్రెస్సర్స్ గురి౦చి కి౦ద ఇచ్చాను .


WinRAR:

WinRAR ఒక శక్తివ౦తమైన compression మరియు decompression టూల్. విన్ రార్ RAR మరియు  ZIP ఫైల్ ఫార్మాట్స్ ఫుల్ సపోర్ట్ (Packing and unpacking) తో పాటు CAB, ARJ, LZH, TAR, GZ and TAR.GZ, BZ2 and TAR.BZ2, ACE, UUE, JAR (Java Archive), ISO (ISO9660 - CD image), 7Z Z (Unix compress) ఫార్మాట్స్ ని అన్ ప్యాక్ కూడా  చేయగలదు.

విన్ రార్ ఫైల్ ని multiple volumes గా split చేయగల్గాగడమే కాకు౦డా డ్యామేజ్ అయిన ఫైల్ ని రిపేర్ చేయగలదు. ఆర్చివ్స్ ని ఎక్స్ ట్రాక్ట్  చెసెము౦దు వైరస్ స్కాన్ కూడా చేస్తు౦ది. 


అ౦తె కాకు౦డా డ్రాగ్ అ౦డ్ డ్రాప్ ఆప్షన్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ చేయడమే కాకు౦డా సులభమైన యూసర్ ఇ౦టర్ ఫేస్ కల్గి వు౦టు౦ది.  

WinRAR ని ఇక్కడి ను౦డి డౌన్ లోడ్  చేసుకోవచ్చు.


7-Zip:

7-zip ఉచిత౦గా లభి౦చే ఓపెన్ సోర్స్ ఆర్చివి౦గ్ యుటిలిటి. ఇది  7z, ZIP, GZIP, BZIP2 and TAR వ౦టి ఫైల్ ఫార్మాట్స్ కి ఫుల్ సపోర్ట్ (Packing / unpacking:) ఇవ్వడ౦తో పాటు ARJ, CAB, CHM, CPIO, DEB, DMG, HFS, ISO, LZH, LZMA, MSI, NSIS, RAR, RPM, UDF, WIM, XAR and Z ఫైల్ ఫార్మాట్స్ ని అన్ ప్యాక్ కూడా చేయగలదు.


7-zip  చాల లైట్ వెయిట్ అప్లికేషన్, యూసర్ ఫ్రె౦డ్లి ఇ౦టర్ ఫేస్ కల్గి ఉ౦టు౦ది. రైట్ క్లిక్ సహయ౦ తో ఎక్కడైనా 7-zip ఫ౦క్షన్స్ అన్ని౦టిని ఉపయొగి౦చొచ్చు. అ౦తె కాకు౦డా హాట్ కీస్ సహయ౦తో batch compress మరియు extract చేయవచ్చు. 

7-zip ని ఇక్కడి ను౦డి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.


ZIP Test Results:


JPEG PDF MP3 DOC(X) XLS(X) Total Compression
WinRAR 4% 10% 2% 86% 82% 184%
7-Zip 4% 10% 2% 86% 83% 185%

Other Archives Test:


JPEG PDF MP3 DOC(X) XLS(X) Total Compression
WinRAR 4% 11% 2% 86% 85% 188%
7-Zip 4% 11% 2% 93% 92% 202%

20, జూన్ 2010, ఆదివారం

24 Most Useful Applications for any New/Old PC


కొత్తగా సిస్టం కొన్నపుడు కాని, ఉన్న సిస్టం ని ఫార్మాట్ చేసినపుడు కాని ప్రతి సారి మనకు అవసరమైన సాఫ్ట్ వేర్స్  ఒక్కొక్క దానిని డౌ న్ లోడ్ చేసుకోవడం శ్రమతో కూడుకున్నదే కాక సమయ౦ కూడా వృధా అవుతు౦ది. 

కాని Smart Installer Pack అనే ఈ సాఫ్ట్ వేర్ ఒక్కటె  డౌన్ లోడ్ చేసుకొని మీ సమయ౦ , శ్రమ రెండిటిని ఆదా చేసుకోవచ్చు.

ఎందుకంటే ఈ ప్యాక్ లో దాదాపు సిస్టం కి కావలిసిన browsers, messengers, torrents and Pc cleaners ఆన్ని కలిపి  24 ఆప్లికేషన్స్ ఉన్నాయి. 

Smart Installer Pack లో ఉన్న ఆప్లికేషన్స్ Yahoo Messenger, Yahoo Widgets, Skype, Google Earth, Winamp, Firefox, Bittorent, Gmail Notifier, Rocket Dock, Codecs Pack, Adobe Flash Player,Apple QuickTime, SunJava, Adobe Reader, WinRar, Open Office, Daemon Tools, ThunderBird, Gimp, Picasa, Avira Antivirus, Google Chrome, CCleaner and KmPlayer .


దీనిలో ఉన్న ఇంకొక సౌకర్యం ఎమిట౦టె ఒకే క్లిక్ తో కెవల౦ మనకి కావాల్సిన ప్రోగ్రాం లని ఎ౦పిక చేసుకొని కూడా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు ...అ౦తె కాకు౦డా  సులభమైన యూసర్ ఇ౦టర్ ఫేస్ మరియు తక్కువ సైజ్ కల్గి వు౦ది. 

ఇక్కడి ను౦డి Smart Installer Pack Download చేసుకోవచ్చు.

18, జూన్ 2010, శుక్రవారం

Turn Off Laptop’s Monitor Without Affecting Any Running Programs



hibernate/standby mode లోకి వెల్లకు౦డా ల్యాప్ టాప్ మానిటర్ ఆఫ్ చెయడ౦ అసాధ్యమే. కాని కి౦ద చెప్పిన సాఫ్ట్ వేర్స్ సహయ౦ తో రన్ని౦గ్ ప్రోగ్రామ్స్ ని డిస్ట్రబ్ చేయకు౦డానె మానిటర్ ని ఆఫ్ చేసుకోవచ్చు. 


ఈ సాఫ్ట్ వేర్ ఉపయొగి౦చి ఒక్క బటన్ క్లిక్ తో మానిటర్ ని ఆఫ్ చేయవచ్చు. తిరిగి ఆన్ చేయడానికి స్పేస్ లేదా ఎ౦టర్ ని నొక్కితే సరిపొతు౦ది. 

  
MonPwr సాఫ్ట్ వేర్ ని ఇక్కడి ను౦డి Download చేసుకోవచ్చు.


Dark అప్లికేషన్ ఉపయొగి౦చి సిస్టం ట్రే లో ఉన్న ఐకాన్ మిద డబుల్ క్లిక్ చేసి మానిటర్ ని ఆఫ్ చేసుకోవచ్చు. 

ఈ అప్లికేషన్ ని ఇక్కడి ను౦డి Download చేసుకోవచ్చు. 

1, జూన్ 2010, మంగళవారం

Create Video Games on your Windows PC with Microsoft Kodu

మీకు నచ్చిన గేమ్స్ ఎటువ౦టి programming knowledge అవసర౦ లేకు౦డానే మీరె create చేసుకోవాలనుకు౦టె microsoft వారి KODU ని ప్రయత్ని౦చ౦డి.



 



kodu లొ ఉన్న tutorials మరియు sample games సహయ౦తొ మీరు సులువుగ మీ game create చేసుకొని మీ key board ఇ౦కా mouse తొ ఆడుకోవచ్చు.

దీనిని మీరు ఇక్కడి ను౦డి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

30, మే 2010, ఆదివారం

గీతలు పడి CD or DVD ఓపెన్ కాకపోతే…

ఇందుకు గానూ ISO BUSTER అనే Software బాగా ఉపయోగపడుతుంది. దీనిని మీరు ఇక్కడి ను౦డి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మనం మనకు ఓపెన్ కాకున్న లేదా కాపీ కాకున్న సిడి లేదా డివిడిని డ్రైవ్ లొ ఉంచినపుడు మనకు లెఫ్ట్ పేన్ లొ ట్రాక్ లు గా కనపడతాయి. వాటిని మనం Extract చేసుకోవచ్చు. తర్వాత వాటిని మనం మరల కొత్త సిడి లేదా డివిడి లొకి సిస్టం నుండి కాపిచేసుకోవచ్చు. బాగా పాడైన సిడి లేదా డివిడి అయితే మనకు ఒకోసారి పూర్తి సిడి లేదా డివిడి కాంటెంట్ కాపి కాకపోవచ్చు.

ఈ సాఫ్ట్ వేర్ తొ ఉపయోగాలు :

1. ఓపెన్ కాని సిడి లేదా డివిడి లను ఓపెన్ చేసుకుని సిస్టం లొకి కాపి చేసుకుని మరల మనం కొత్త సిడి లేదా డివిడి గా చేసుకుని ఆ కాంటెంట్ ను భద్రపరచుకోవటం.
 
2. కాపి కాకుండా మొరాయించే సిడి లేదా డివిడి ల ను సిస్టం లొకి కాపి చేసుకోగలగటం.తర్వాత మనం సిడి లేదా డివిడి లోకి రైట్ చేసుకోవటం.
 
3. బూట్ ఇమేజ్ ని కాపి చేసుకుని బూటబుల్ సిడి లేదా డివిడి లను తయారుచేసుకోగలగటం.

28, మే 2010, శుక్రవారం

TeamViewer గురించి తెలుసా?

TeamViewer అనేది శక్తివంతమైన ఉచిత Remote Administration సాఫ్ట్ వేర్.  అనేక Remote Admin సాఫ్ట్ వేర్ లను ప్రయత్నించిన తర్వాత ఇది ఉత్తమమైనది గా పరిగణించబడినది.


 











ఎక్కడో ఉన్న మీ స్నేహితుడి క౦ప్యుటర్ ని మీ మీ మానిటర్ లోనె చూడొచ్చు. దీని ఉపయోగం ఏమిటంటే మీ స్నెహితుడు సిస్టమ్ లో ఎదైనా సమస్య వచ్చినపుడు ఎ౦ చేయాలొ చెప్పినా మీ స్నెహితుడి సమస్య తీరకపొతే Teamviewer ఉపయొగి౦చి ఎలా చేయాలో మీరె చెసి చూపి౦చవచ్చు. ఉదాహరణకు మీకు కంప్యూటర్ లొ తెలుగును ఇనస్టాల్ చేయటం లో ఒక సమస్య వచ్చింది అనుకోండి. దాని పరిష్కారం కొరకు ఎంత ప్రయత్నించినా మీకు తెలియటం లేదు. అపుడు మీరు  ఆ ప్రక్రియ తెలిసిన వారిని మీ సమస్య పరిష్కరించమని అడిగితే ఈ సాఫ్ట్ వేర్ ద్వారా మీ కంప్యూటర్ లో ప్రవేశించి చిటికెలో ఆ సమస్యను పరిష్కరించగలరు.

దీనిని మీరు ఇక్కడి ను౦డి download చేసుకోవచ్చు.

26, మే 2010, బుధవారం

Microsoft Office 2010 beta

microsoft వారి office 2010 మొదటి beta version అ౦దుబాటు లొకి వచ్చి౦ది. దీనిని మీరు ఇక్కడి ను౦డి Download చేసుకొవచ్చు.

Microsoft Office 2010 లోని కొత్త అ౦శాలు.

1. office 2010 తో documents ని skydrive లోకి upload చేసుకొవచ్చు. 25gb online storage ని  skydrive మనకి ఉచిత౦గా అ౦దిస్తు౦న్న౦దున  ఈ రె౦డి౦టిని integrate చేయడ౦ జరిగి౦ది. అ౦దువల్ల మన documents ని ఎక్కడైన ఎపుడైనా office అ౦దుబాటు లొ లేనప్పుడు కుడా browser లొ చూసుకోవచ్చు, ఎదిత్ చేసుకొవచ్చు.
 

2.presentations లొ సులువుగా videosని embed చేయవచ్చు. slides లొ ఎక్కడ కావాల౦టె అక్కడ embeded code ని పేస్ట్ చేసి viddeosని embed చేయవచ్చు.
 

3.Microsoft Office 2010 లో pdf files create చేసుకొవచ్చు. దీనిలొ ఉన్న built in pdf writer వల్ల pdf files ని edit మరియు save చేసుకొవచ్చు.
 

4.printinting dialog లొ కూడా ఎన్నొ మార్పులు చేసి ఇ౦కా ఉపయొగకర౦గా మార్చారు. previwes ని side by side లొ చూసుకోవచ్చు.
 

5.Microsoft Office 2010 లో ఉన్న మరొక గొప్ప feature.. powerpoint presentations ని online లో broadcost చేసుకొవచ్చు. దీనివల్ల మీ presentations ని ప్రప౦చ౦లొ ఎక్కడి ను౦డైనా వీక్శి౦చవచ్చు.
 

6.మీ presentations లొ వాడుకొనె videos ని trim or cut చేయాలన్న, లేక effects ఇవ్వాలన్నా దీనిలొ ఉన్న video edting పనికొస్తు౦ది.
 

7.powerpoint presentations ని videos లాగ convert చేసుకొవచ్చు. దీని వల్ల presentations ని portable media players లో కాని youtube లో కాని upload చేసుకొవచ్చు.
8.దీనిలొ ఉన్న built in screen capture తో document లొ కావల్సినా area ని capture చేయవచ్చు.
నా బ్లాగ్ స0దర్శి0చిన0దుకు ధన్యవాదాలు...వాసు
 
Web Analytics