మీ హోం కంప్యుటర్ లో వున్నఫైల్స్ , ఫోటోస్, డాక్యుమెంట్స్ ని వేరే చోట వున్న కంప్యుటర్ లలో యాక్సెస్ చేయాలనుకుంటే డీ ఫాల్ట్ గా Dropbox నే ఎంచుకుంటారు. కాని ఇప్పుడు Dropbox Windows Live SkyDrive తో పాటు మరియు Google Drive కూడా అందుబాటు లోకి వచ్చింది.
జీ మెయిల్ యుసర్లందరికి 5GB space ని ఉచితంగా అందిస్తుంది. GDrive లో మీ ఫోటోలు, డాక్యుమెంట్స్, వీడియోస్ మరియు ఏ ఇతర ఫైల్ అయినను store చేసుకోవచ్చు . GDrive ని మీ యొక్క కంప్యుటర్ లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు(విండోస్ అండ్ మాక్). Android మరియు iPhone (still under construction) App ని వుపయోగించి Google Drive ని మీ యొక్క మొబైల్ ఫోన్ నుండి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు .
Google Drive గూగుల్ యొక్క ఇతర సర్వీసెస్ అయిన జీ మెయిల్, డాక్స్ మరియు గూగుల్ ప్లస్ తో అనుసంధానమై వుంటుంది. కావున మీరు GDrive లో వున్న ఫైల్స్ ని / డాక్యుమెంట్స్ ని ఆన్ లైన్ లో షేర్ చేసుకోవచ్చు మరియు ఎవరితోనైనా కలిసి రియల్ టైం లో ఎడిట్ చేసుకోవచ్చు.
మరి ఏ ఇతర cloud storage లో లేని ఒక ప్రత్యేకత Google Drive లో వుంది. అదేంటంటే సెర్చ్ చేసినపుడు GDrive ఫైల్స్ లోపల కూడా సెర్చ్ చేయగలుగుతుంది (using Optical Character Recognition (OCR)). దీని వలన మనకు కలిగే ముక్యమైన ఉపయోగం ఎంటoటె మీరు స్కాన్ చేసిన ఫైల్స్ (pdf or images)లో కూడా సెర్చ్ చేయగల్గుతారు.
Special Discount Offers for Schools and Colleges
For Pricing Please
write us at support@nirvanatechnosolutions.com
ఉచితంగా 5GB అందిస్తున్నప్పటికీ ప్రో అకౌంట్ ద్వారా ఇంకా ఎక్కువ స్టోరేజ్ ని పొందవచ్చు. https://drive.google.com లింక్ పైన క్లిక్ చేసి గూగుల్ ఐడి తో సైన్ ఇన్ అయి గూగుల్ డ్రైవ్ ని పొందవచ్చు. ఒక వేళ మీకు Your Google Drive is not ready yet అనే మెసేజ్ గనక కనిపించినట్లయితే ఇంకా కొన్ని రోజులు GDrive కోసం ఎదురు చూడవలసిందే!!
‘Notify me’ మీద క్లిక్ చేసి GDrive రెడి అయిన తర్వాత ఈ మెయిల్ ద్వారా నోటిఫికేషన్ పొందవచ్చు. గూగుల్ డ్రైవ్ యొక్క అఫీషియల్ విడియో ప్రివ్యు చూడండి.